ఘనంగా దీపావళి వేడుకలు

Oct 30,2024 13:00 #ambedkar konaseema

ప్రజాశక్తి-రావులపాలెం: రావులపాలెం సెయింట్ పాట్రిక్స్ అకాడమీ స్కూల్లో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. గురువారం స్థానిక సెయింట్ పాట్రిక్ స్కూల్లో జరిగిన దీపావళి వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి అంటే వెలుగు అని, జీవితాల్లో వెలుగు నింపుకొని, పదిమందికి పంచాలని, దీపావళి అంటే దీపాలు వెలిగించే పండుగని, మన మనసుల్లో చీకటిని పాలత్రోలి, వెలుగులను నింపే పండగే దీపావళి అని, ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదువుకోవాలని, మీ చదివే మీకు గౌరవాన్ని ఇస్తుందని, మీ తల్లిదండ్రులకు కూడా గౌరవం పెంచుతుందని, మీ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు, మీరు చదివిన పాఠశాలకు, మీరు పుట్టిన గ్రామానికి, మీ ప్రాంతానికి సమాజంలో గౌరవాన్ని పెంపొందిస్తుందని, అది కేవలం మీ చదువు వలన, వీరి సాధించిన విజయాల వలన మాత్రమేనని. మీలో ప్రతి ఒక్కరు అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్, ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నత శ్రేణి ఉద్యోగాలలో ఉండే అవకాశం మీరు చదివిన చదువును బట్టి ఉంటుందని, తోటి విద్యార్థులను ప్రేమించాలని, అందరూ కలిసి మెలసి ఆనందంగా ఉండటమే నిజమైన దీపావళని రామకృష్ణ అన్నారు. ఇంత పెద్ద అకాడమీ పెద్దపెద్ద నగరాల్లో ఉండాలని, ఈ మారుమూల ప్రాంతం రావులపాలెంలో ఈ అకాడమీ నెలకొల్పడం మన అదృష్టమని, నేను స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానంద రావు అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ రహదారి వెంట వెళుతున్నప్పుడు ఇంత పెద్ద అకాడమీ ఇక్కడ నెలకొల్పడం, సెంట్రల్ సిలబస్ అకాశం ఉండటం, ఇందులో చదివిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, ఇక్కడి నుండే సైంటిస్టులు, క్రీడాకారులు, ప్రపంచ మేధావులు, రాజకీయ నాయకుడు, శాస్త్రవేత్తలు, విజ్ఞాన వేత్తలు, ఉన్నతశ్రేణి ఉద్యోగులు ఈ అకాడమీ నుండి వెళ్లే అవకాశం ఉందని, అంత మంచి పాఠశాలలో మీరందరూ చదువుకోవటం మీ అదృష్టమని, ఈ మహదవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని, మీరందరూ ఉన్నత శ్రేణి విద్యా వంతులు కావాలని, ఈ అకాడమీ బాధ్యులకు, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ప్రిన్సిపాల్ బ్రదర్ అను మాథ్యూ, కమ్యూనిటీ లీడర్ బ్రదర్ ఫెలిక్స్ అరుణ్, సాధనాల సత్యనారాయణ,బలువు కోటేశ్వరరావు, కర్రీ నాగరాజు, గోపిశెట్టి రామచంద్రుడు మొదలగువారు పాల్గొన్నారు.

➡️