యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

Feb 3,2025 22:54
యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

ప్రజాశక్తి-ముమ్మిడివరం ఎంఎల్‌సి కోడ్‌ అమల్లోకి వచ్చి వారం రోజులు గడిచినా అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. మండలంలో పలు గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు యథావిధిగా దర్శనమిస్తున్నాయి. నగర పంచాయతీ కార్యాలయానికి కూత వేటు దూరంలో జాతీయ రహదారి చెంతనే ఉన్న రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలు ఓపెన్‌గా దర్శనమిస్తున్నాయి. దీంతో అసలు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందా లేదా అనే అనుమానం వ్యక్తమౌతుంది.

➡️