ప్రజాశక్తి-అమలాపురం ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ముద్రించిన ఉద్యమ క్యాలెండర్‌ను ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు సోమవారం అమలాపురంలో ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం 2011 నుంచి ముద్రిస్తున్న క్యాలెండర్‌కు ప్రజా ఉద్యమాలకు మద్దతుగా ప్రకటనలు ఇచ్చి సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం నిరంతరం పేదలు దళితులు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తున్నట్టు ఆయన కొనియాడారు. ఇదే ఒరవడిని కొనసాగించాలని, ప్రజల సమస్యలపై పోరాడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు తాడి శ్రీరామ్మూర్తి, పొలమూరు శ్రీను, భీమాల శ్రీను, కె.సత్తిబాబు పాల్గొన్నారు.
