అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే 

Nov 28,2024 12:36 #ambedkar konaseema

ప్రజాశక్తి-మండపేట : మండపేట పెద్ద కాలువ వంతెన వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే, అలాగే పట్టణంలోని వాణిమహల్ జంక్షన్ వద్ద వున్న పూలే విగ్రహాలకు 134వ వర్ధంతిని పురస్కరించుకొని మండపేట పట్టణ జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాతీయ బీసీ సంఘం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోన సత్యనారాయణ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని అట్టడుగు వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి అని కొనియాడారు. అదే విధంగా జిల్లా జాతీయ సంఘం గౌరవ అధ్యక్షులు వీరమల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీల వర్గాలు బాగుపడాలంటే విద్య ఒక్కటే మార్గమని గ్రహించి వారు భార్య సావిత్రిబాయి కలిసి స్త్రీ పురుషులకు విద్య నేర్పించి అణగారిన వర్గాలకు చైతన్యపరిచి అభివృద్ధి పదంలో నడిపించిన మహాశక్తి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మలువలస గణపతి, జిల్లా గౌరవ అధ్యక్షులు పెంకె గంగాధరరావు, మండపేట నియోజకవర్గ అధ్యక్షులు విన్నకోట రాధాకృష్ణ, సెక్రెటరీ తీగిరెడ్డి మహేష్, సభ్యులు, చుక్కల అప్పారావు, పంపన శ్రీనివాసు, ఒంపోల్ పాల్ రాజ్, కాసిన కాశి, గోరు అన్నవరం, రామోజు కృష్ణ, నరసింహమూర్తి, మామిడి శెట్టి శ్రీనివాసు, అత్తిలి సత్యనారాయణ, గుత్తుల శ్రీనివాసు, తదితరు బిసి నాయకులు పాల్గొన్నారు.

➡️