మళ్లీ కంగిన కుండలేశ్వరం ఏటిగట్టు

Oct 9,2024 22:04
మళ్లీ కంగిన కుండలేశ్వరం ఏటిగట్టు

ప్రజాశక్తి-కాట్రేనికోన కుండలేశ్వరం సమీపంలో మళ్లీ ఏటిగట్టు కుంగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. గడచిన కాలంలో మురముళ్ళ నుండి పల్లంకుర్రు వరకూ ఏటిగట్టును బిటి రోడ్డుగా రూ.కోట్టు వెచ్చించి ఆధునికీకరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల సమయంలో కుండలేశ్వరం పుష్కర రేపు సమీపంలో ఏటిగట్టు కాలవ గట్టు వైపున కృంగిపోయింది. దీంతో అధికారులు ఆ ప్రాంతంలో మరమ్మతు చేసి చేతులు దులుపుకున్నారు. అయినప్పటికీ ఏటిగట్టు కంగిపోయింది. దీంతోకలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ కుంగిన ఏటిగట్టును పరిశీలించడంతో ఉన్నతా ధికారులు గ్రావెల్‌తో పూడ్చి సరి చేశారు. వేసిన గ్రావెల్‌ నాణ్యత లేకపోవడంతో ఆ ప్రాంతంలో తిరిగి ఏటిగట్టు మళ్లీ కుంగిపోయింది. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కుంగిన ఏటిగట్టు ప్రాంతాన్ని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి.దుర్గాప్రసాద్‌ పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు.

➡️