శ్రీనును పరామర్శించిన కెవిపిఎస్ బృందం

Feb 11,2024 13:07 #Konaseema
kvps meet kodi katti victim srinu

ప్రజాశక్తి-ముమ్మిడివరం : కోడి కత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ కు హై కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విశాఖ సెంట్రల్ జైల్ నుండి బైయిల్ పై విడుదలై ఇంటికి చేరుకున్న శ్రీనును ఆదివారం కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి బృందం బాధితుడు శ్రీను మరియు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్బంగా బాధితుడికి, కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని, ప్రభుత్వాలు చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్య వైఖరితోనే బాధితుడు శ్రీను సుమారు 6 యేళ్లు జైలు లోనే గడపవలసి వచ్చిందన్నారు. ఎస్సీ ఎస్టీల కోసం ఏర్పాటు చేసిన విజిలెన్స్ మరియు మోనటరింగ్ కమిటి సమావేశాలు సక్రమంగా నిర్వహించక పోవడంతో అయా వర్గాలకు కేటాయించిన బడ్జెట్ నిధుల కేటాయింపులు జరగక పోవడంతో, నిధులు పక్కదారి పట్టి దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ చట్టాలను పటిష్టంగా అమలు చేసే విధంగా మోనటరింగ్ వ్యవస్తను బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోడి కత్తి శ్రీను కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సిఐటియు జిల్లా కార్యదర్శి జి దుర్గా ప్రసాద్ కేవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు శెట్టిబత్తుల తులసి రావు సభ్యుడు యలమంచిలి బాలరాజు ఆర్ పిఐ నాయకుడు పాము అంబేడ్కర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.

➡️