ప్రజాశక్తి-మండపేట : లారీ పైకి ఎక్కి శుభ్రం చేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లిలో శనివారం జరిగింది . ఈ సంఘటనకు సంబంధించి మండపేట రూరల్ ఎస్సై బుచ్చిబాబు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి గ్రామానికి చెందిన చిటికెన రామకృష్ణ అనే లారీ డ్రైవర్ వేములపల్లి గోదావరి ఎడిబుల్ ఆయిల్ కంపెనీ ఎదురుగా తన లారీ పైకి ఎక్కి శుభ్రం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పైన ఉన్న కరెంటు తీగలు తగిలి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
