జ్యోతిరావు ఫూలే బాటలో నడుద్దాం

Apr 11,2025 18:28
IMG

అంబాజీపేట బస్టాండ్‌ వద్ద పూలే చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న గన్నవరపు శ్రీనివాస్‌, వైసిపి శ్రేణులు

ప్రజాశక్తి – అంబాజీపేట

మహాత్మా జ్యోతిరావు ఫూలే బాటలో నడుద్దాం అని వైసిపి నియోజకవర్గ కన్వీనర్‌ గన్నవరపు శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం జ్యోతిరావు ఫూలే 199 వ జయంతి సందర్భంగా అంబాజీపేట వైసిపి మండల శాఖ అధ్యక్షులు విత్తనాల ఇంద్ర శేఖర్‌ ఆద్వర్యంలో బస్టాండ్‌ వద్ద జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పూలే జయంతి వేడుకలు నిర్వహించి పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల రక్షణ అభ్యున్నతికి నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలన్నింటికీ జ్యోతిరావు ఫూలే, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ ఆశయాలే ఆదర్శాలన్నారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం మాజి ఎంఎల్‌ఎ పాముల రాజేశ్వరి దేవి, ఎంపిపి డి.వెంకటేశ్వరరావు, జడ్‌పిటిసి సభ్యురాలు భూడిద వరలక్ష్మి, సీనియర్‌ నాయకులు మందపాటి కిరణ్‌, పేరి కామేశ్వరావు, మైలే ఆనందరావు, ముత్తబత్తుల ప్రశాంత్‌, ఎంఎం.శేట్టి, డి.సత్యమోహన్‌, వాసంశేట్టి రేవతి పెదబాబు, పాముల ప్రకాష్‌, పితాని శెట్టి, ఉందుర్తి నాగబాబు, మట్టపర్తి బాలాజీ, జి. మహేష్‌, వడలి కృష్ణ మూర్తి, సిహెచ్‌.వెంకటేశ్వరావు, కె.సత్తిబాబు, శీలం మోహన్‌ రావు, మట్ట వెంకటేశ్వరావు, కాండ్రేగుల గోపాలకృష్ణ, జె.ఏడుకొండలు, కుసుమ శ్రీను, అందే మూర్తి, గోసంగి బాబులు, రాయుడు షణ్ముఖ, ఇళ్ల గోపి, గోసంగి కుమార్‌ స్వామి, ఎమ్‌. నాగరాజు, పిల్లి శ్రీను, కుడిపూడి సతీష్‌, తదితర రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచ్‌లు, వార్డ్‌ మెంబర్స్‌, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, సచివాలయ కన్వీనర్లు, బూత్‌ కమిటీ కన్వీనర్లు, బూత్‌ కమిటీ ఉపాధ్యక్షులు, సోషల్‌ మీడియా వారియర్స్‌, గహ సారధులు, నాయకులు, కార్యకర్తలు, వైసిపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

➡️