ప్రజాశక్తి-ముమ్మిడివరం: అణగారిన వర్గాల జీవితాల్లో అక్షర కాంతులు వెలిగించిన సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా శాఖా కొనియాడింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక బుద్ధ పార్కు అవరణలో బి ఎస్ ఐ జనరల్ సెక్రెటరీ శరత్ అధ్యక్షతన గురువారం మహాత్మా ఫూలే 134వ వర్ధంతి కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా మహాత్మా ఫూలే మరియు అంబేడ్కర్ చిత్రపటాలకు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎం ఆశీర్వాదం ఫూలే చేసిన సేవలను కొనియాడుతూ సమాజంలోని అసమానతలు మరియు స్త్రీ,పురుషుల మధ్య లింగ వివక్షతను పోగొట్టడానికి బడుగు బలహీనర్గాలకు విధ్యనందించడం కోసం తన భార్య సావిత్రిబాయి ఫులేకి విద్యను నేర్పి, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దడమే కాకుండా స్త్రీ విద్యా వ్యాప్తికి పాటశాలలను స్థాపించి ఎంతో మంది మహిళల జీవితాల్లో అక్షర కాంతులు వెలిగించిన సామాజిక విప్లవ కారుడు ఫూలే అని పేర్కొన్నారు. అడ్వకేట్ వడ్డీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫూలే సామాజిక సేవలను గుర్తించి 1888లో ముంబైకి చెందిన సామాజిక సంస్కర్త రావు బహదూర్ విఠల్ రావు కృష్ణాజి వాందేకర్ మరి కొంత మంది కలిసి ఫూలే కి మహాత్మా బిరుదును ప్రదానం చేశారని అంబేడ్కర్ ఫులేను గురువుగా స్వీకరించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనిపల్లి సత్యనారాయణ సఖిలే పృథ్వీరాజ్ బొక్క శ్రీనివాస్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.