మలేరియా నిర్మూలనపై అవగాహన ర్యాలీ

Jun 11,2024 22:50
మలేరియా నిర్మూలనపై అవగాహన ర్యాలీ

ప్రజాశక్తి -మామిడికుదురు, ఉప్పలగుప్తంఆరోగ్య సమతుల్యత సాధన కోసం మలేరియా వ్యతిరేక పోరాటాన్ని వేగవంతం చేయాలని లూటుకుర్రు పిహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్‌ శైలజ, డాక్టర్‌ స్పందన పిలుపు ఇచ్చారు. లూటుకుర్రులో మలేరియా వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమలను నిర్మూలన మలేరియా వ్యాధిని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై పిహెచ్‌సి సిబ్బందికి అవగాహన కల్పించారు.ఉప్పలగుప్తం పిహెచ్‌సి ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్‌ ఎల్‌.నాగార్జున ఆధ్వర్యంలో మలేరియా నివారణ మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా మలేరియా వ్యాధి నిర్మూలనపై అవగాహన కల్పించారు. దోమలు వద్ది చెందకుండా నిలువ నీటి ప్రదేశాలను గుర్తించి అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మలేరియా యూనిట్‌ ఆఫీసర్‌ వి.రాజ్‌ కుమార్‌, సిహెచ్‌ఒ, ఎం.విజయలక్ష్మి, హెచ్‌వి, జి.కమల, సూపర్‌వైజర్‌ చిట్టిబాబు, పిహెచ్‌సి సిబ్బంది ఆశా వర్కర్‌ లు పాల్గొన్నారు. అంబాజీపేట ముక్కామల పిహెచ్‌సి వైద్యాధికారి ఎ.ఇంద్రావతి ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దోమలను నిర్మూలిద్దాం మలేరియా వ్యాధిని అరికడదాం, డ్రై డే- ఫ్రై డే పాటిద్దామని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ రవికుమార్‌, ఎస్‌యుఒ రాజబాబు, ఎంపిహెచ్‌ఎస్‌ రాధా నరసింహం, హెచ్‌ఎ ప్రసాద్‌ బాబు, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పాల్గొన్నారు.

➡️