పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు

Dec 4,2024 23:14
IMG-

పాతకోట గోదావరి గట్టును పరిశీలిస్తున్న ఆర్‌డిఒ ఇతర అధికారులు

ప్రజాశక్తి కె.గంగవరం

కోటిపల్లి ఏటిగట్టు వెంబడి పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆర్‌డిఒ దేవరకొండ అఖిల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సి ప్లేన్‌ నీటి విమానాలు అభివృద్ధి పరిచి తద్వారా పర్యాటక రంగంలో నూతన విధానాలకు శ్రీకారం చుట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల కష్ణా నది నుంచి ప్రకాశం బ్యారేజ్‌ మీదుగా శ్రీశైలం వరకు సి ప్లేన్‌లో సిఎం చంద్రబాబు స్వయంగా పర్యటించారు. దీని అన్ని ప్రాంతాలకు పర్యాటక రంగంలో అభివృద్ధి పరచాలని భావిం చారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోటిపల్లి గోదావరి చెంత ఏటిగట్టుని అనుకునే ఉన్న ప్రాంతాలు కూళ్ళ, కోటిపల్లి, సుందరపల్లి. పాతకోట, కోరుమిల్లి వరకు గల ప్రాంతాలను రామచంద్రపురం ఆర్‌డిఒ దేవరకొండ అఖిల బుధవారం పరిశీలించారు. కోటిపల్లి లో సుమారు రూ.5 కోట్లతో నిర్మించిన పర్యాటక కేంద్రం అందుబాటులో ఉండగా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే యాత్రికులకు, ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ, కన్జర్వెన్సీ, టూరిజం శాఖల అధికారులు తో కలిసి రామచంద్రపురం ఆర్‌డిఒ కోట, కోటిపల్లి, సుందరపల్లి, కూల్ల, ఏటిగట్టు ప్రాంతాలను పరిశీలించారు, సి ప్లేన్‌ నిర్వహణకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించి, దానిపై నివేదిక తయారుచేసి ప్రభుత్వనికి అందజేస్తామని ఈ సందర్భంగా ఆర్‌డిఒ వివరించారు. ఆమె వెంట కె. గంగవరం తహశ్లీల్దార్‌ మృత్యుంజయరావు, ఇతర శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

➡️