కొబ్బరి తోటల పునరుద్ధరణకు చర్యలు

Jan 22,2025 22:59
IMG

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌

ప్రజాశక్తి – అమలాపురం

కొబ్బరి తోటలు పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా కొబ్బరి అభివద్ధి బోర్డు నిధులతో ముదురు, కాయలు కాయని, రోగాల బారిన పడిన కొబ్బరి తోటలు స్థానే పునరుద్ధరణ కొరకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఉద్యాన అధికారులను ఆదేశించారు. కొబ్బరి తోటల పునరుద్ధరణపై నియమింపబడిన జిల్లా స్థాయి మానిటరింగ్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్‌ నందు బుధవా రం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం అమల్లో భాగంగా పునరు ద్ధణ పథకం జిల్లా స్థాయి కమిటి క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేసిందని తెలిపారు. జిల్లాలో ఉ ద్యాన శాఖ ద్వారా అమలు కాబడుతున్న కొబ్బరి తోటల పునరుద్ధరణ పథకాన్ని అర్హులైన రైతులను గుర్తించి పథక ప్రయోజనాలు లబ్ధిని చేకూర్చుతూ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. రానున్న ఏడాది కొరకు కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతు ఉత్పత్తి దారుల సంఘాల ద్వారా కొబ్బరి తోటలో పునరుద్ధరణ సంబంధిత ప్రతిపాదనలు రూపొందించి కొబ్బరి అభివద్ధి బోర్డు నుంచి మరిన్ని నిధులు జిల్లాకు కేటా యించేలా తద్వారా ముదురు తోట్ల పునరు ద్ధరణ పూర్తి స్థాయిలో జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.ఈ బృందం అమలాపురం మండలంలో ఇందుపల్లి గ్రామం, అంబాజీపేట మండలంలో వాకల గరువు, గంగలకుర్రు, పుల్లేటికుర్రు గ్రామాలలో అయినవిల్లి మండలంలో మాగం, క్రాప గ్రామాలలో ముమ్మిడివరం మండలంలోని లంక అఫ్‌ ఠాణే లంక గ్రామాలను యాదృచ్ఛికంగా తనిఖీ నిర్వహిం చారన్నారు. జిల్లా వ్యాప్తంగా 1000 హెక్టార్లలో కొబ్బరి తోటల పునరు ద్ధరణకు నిధులు మం జూరు కాగా స్థానికంగా ఉన్న జనరల్‌ కేటగిరీ లో 860 హెక్టార్లలో తోటలు పునరుద్ధరణకు అర్హుల ను గుర్తించడం జరిగిందన్నారు. ఒక్కొక్క హెక్టార్కు రెండు సంవత్సరాల పాటు మొక్కల పెంపకా నికి ఈ పునరుద్ధరణ పథకం ద్వారా రూ.53,500 అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి బివి.రమణ, జిల్లా వ్యవసాయ అధికారి, కాకి నాగేశ్వర రావు, జిల్లా పట్టు పరిశ్ర మ అధికారి బి. గీతారాణి, సీనియర్‌ శాస్త్రవేత్త ప్లాంటేషన్‌ పాథాలజీ, ఉద్యాన పరిశోధన స్థానం డాక్టర్‌ వి.గోవర్ధన్‌రావు, హెచ్‌ఎన్‌. ఫీల్డ్‌ డెవలప్మెంట్‌ అధికారి కొబ్బరి అభివద్ధి బోర్డు విజ యవాడ, శ్రీ శరత్‌ ఉద్యాన అధికారి దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️