ప్రజాశక్తి-రాజోలు: వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. బుధవారం శివకోడు, రాజోలు, పొదలాడ, బి.సావరం, కడలిలో ఆరు ఒవర్ హెడ్ ట్యాంకులను ఎంఎల్ఎ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎతో మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి లేకూండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతీ ఇంటికి మంచినీటి సరఫరాలో భాగంగా 6 ఒవర్ హెడ్ ట్యాంక్ లుప్రారంభించామన్నారు. 60 గ్రామ పంచాయితీలో భూగర్భ జలాలు ఉప్పుమయం అవడం వల్ల తాగునిటి సమస్యలు అధికమైనాయి.కరెంట్ సరఫరా ఉంటేనే నీటి సరఫర జరుగుతుంది. దీనికి రాజోలు నియోజకవర్గ వ్యప్తంగా 260 ట్రాన్స్ఫార్మర్లు అవసరం. వేసవిలో అవసరం అయిన చోట ట్రాన్స్ పార్మర్లు ఎర్పాటు చేసి లో ఓలె్టెజ్ లేకుండా పిటిఆర్ కెపాసిటి పెంచడానికి చర్యలు చేపట్టాము. సబ్ స్టెషన్ ల వల్ల లోఒల్టేజ్ నిర్ములించగలం. ఇందులో భాగంగానే రెండు కొత్త విద్యూత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. తాగునీటి సమస్యకై రానున్న రోజుల్లో రూ 1650 కొట్లుతో ధవళేశ్వరం నుండి డైరక్ట్ పైప్ లైన్ సుమారు 90 కిలోమీటర్ల పైప్ లైన్ కు ప్రతిపాధనలు చేసినట్లు చెలిపారు.అది పూర్తి అయితే రాజోలు నియోజకవర్గం సశ్యశామలం అవుతుంది. రాజోలు నియొజక వర్గాన్ని మోడల్ నియోజక వర్గంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డెల్టా చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, రాజోలు ఎంపిపి కేతా శ్రీనివాస్, డిసి చైర్మన్ పినిశెట్టి బుజ్జి, శివకోడు సర్పంచ్ నక్కా రామారావు, జనసేన సినియర్ నాయుకులు దిరిశాల బాలాజీ, చాగంటి స్వామి పలువురు పాల్గోన్నారు.
