హాస్టల్‌ విద్యార్థులకు మెడికల్‌ క్యాంప్‌

Apr 16,2024 23:46

విద్యార్థులకు వైద్య పరీక్షలు

ప్రజాశక్తి-రామచంద్రపురం

హాస్టల్‌ విద్యార్థులకు సౌకర్యాలు లేమి అనే శీర్షిక ఈనెల 13న ‘ప్రజాశక్తి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఈ మేరకు హాస్టల్‌ వార్డెన్‌ అబ్బిరెడ్డి శ్రీనివాసరావు మంగళవారం హసనబాదలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో విద్యార్థులకు మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు. ద్రాక్షారామ ఆరోగ్య కేంద్ర వైద్యులు తోలేటి సందీప్‌ నాయుడు వైద్య సిబ్బందితో సుమారు 60 మంది విద్యార్థులు పరీక్షించి వారికి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు పారిశుధ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్‌ వార్డెన్‌ శ్రీనివాసరావు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

 

➡️