ధాన్యంను మిల్లులకు తరలించాలి: ఎంపిడిఒ

Nov 29,2024 16:24
IMG-

రైతులతో మాట్లాడుతున్న ఎంపిడిఒ బి.కృష్ణ మోహన్‌

ప్రజాశక్తి – అల్లవరం

ఇప్పటికే కోసి ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే రైతు సేవా కేంద్రం కు ట్యాగ్‌ చేసిన రైస్‌ మిల్లు కు తరలించాలని ఎంపిడిఒ బి.కృష్ణ మోహన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొమరగిరిపట్నం, తుమ్మలపల్లి, మొగళ్ళమూరు, బెండమూరు లంక దాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపిడిఒ పరిశీలించారు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వరి పంట స్టాండింగ్‌ క్రాప్‌ లో ఉన్నట్లు అయితే రైతులు ఈ ఐదు రోజుల్లో కోయకుండా వాయిదా వేయాలి అని వాతావరణం సాధారణ పరిస్థితికి వచ్చాక రైతులు వరి కోత చేపట్టాలన్నారు. ఇప్పటికే చేతికోతగా పంట కోసి పనలపై ఉంటే వాటిని సురక్షిత ప్రదేశాల్లో తడవకుండా భద్రపరచుకోవాలన్నారు. రైతులకు అవగాహన కల్పించి రైతు సేవా కేంద్రాల్లో రికార్డులు పరిశీలించి గన్ని బ్యాగ్స్‌ రైతులకు ఇవ్వాలన్నారు. సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎఇఒ శుభ గణేష్‌, బెండమూర్లంక విఆర్‌ఓ మెట్ల బాబ్జీ, విఎఎలు మేఘన, విజయ, ధన, రైతులు పాల్గొన్నారు.

➡️