ప్రజాశక్తి,-మండపేట : కూటమి ప్రభుత్వంలో మైనారిటీల సంక్షేమం కోసం సలహాదారుగా నియమితులైన ఎంఏ అహ్మద్ షరీఫ్ నూతన బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మండపేట నుంచి ముస్లిం మైనారిటీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. అమరావతిలో శనివారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మండపేట నుంచి ముస్లిం నాయకులు స్థానిక అబ్దుల్ కలామ్ ఆజాద్ ట్రస్ట్ చైర్మన్ షేక్ మౌలానా ఆధ్వర్యంలో తరలి వెళ్ళారు. ఈ సందర్భంగా షరీఫ్ ను కలిసి దుశ్శాలువాలు పుష్పగుచ్చాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర టీడీపీ మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్, టీడీపీ నూర్ బాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్
షేక్ సుభాన్, రాష్ట్ర టీడీపీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ మౌలానా, జిల్లా నూర్ బాషా సంక్షేమ సంఘం అధ్యక్షుడు షేక్ ఇబ్రహీం, వక్ఫ్ బోర్డు మాజీ సభ్యుడు ఎండీ జఫార్ తదితరులు పాల్గొన్నారు.