వాహన దారులకు అవగాహన కల్పిస్తున్న ఎస్‌ఐ కె.చిరంజీవి
ప్రజాశక్తి – అంబాజీపేట
హెల్మెట్ ధరిం చడం రోడ్డు భద్రత నియమాలు పాటించడం వాహనదారులకే కాకుండా వారి కుటుంబ సభ్యుల రక్షణకు సోపానం లాంటిదని అంబా పేట ఎస్‌ఐ కె.చిరంజీవి అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా అంబా జీపేట సెంటర్‌లో ఆదివారం రాత్రి వాహన దారులకు రోడ్డు భద్రతా నియమాలపై మద్యం తాగి వాహనాలు నడపడంపై అవగాహన కల్పిం చారు. మానవ తప్పిదాలు నిర్లక్ష్యం, మద్యం తాగడం తదితర అజాగ్రత్త వల్లే అధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు అవగాహన కలిగిఉండాల్సిన అవసరం ఉందన్నారు. మద్యం తాగి వాహనం నడపడం ఎంత మాత్రం క్షేమం కాదని ప్రమాదాలు జరిగితే మీ ప్రాణాలకే ప్రమాదం ఉందన్నారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, పెద్ద వాహనాలు నడిచేటప్పుడు సీటు బెల్ట్ తప్పనిసరి అన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులకు సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగి ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే లక్ష్యంతో అవగాహన కల్పిస్తున్నామని ఎస్‌ఐ అన్నారు.