ఈతకోట ఎన్‌ఎసిఎల్ కంపినీలో ముగిసిన జాతీయ భద్రతా వారోత్సవాలు
ప్రజాశక్తి – రావులపాలెం
మండల పరిధి ఈతకోట ఎన్‌ఎసిఎల్ ఇండిస్టీస్ లిమిటెడ్ కంపెనీలో ప్లాంట్ హెడ్‌్ బి.పార్వతి కుమార్ అధ్యక్షతన జరిగిన 54వ భద్రతా వారోత్సవాలు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.రాధాకృష్ణ, చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వి.మురళీకృష్ణ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న ప్రతీ కార్మికుడు వ్యక్తిగత భద్రత తో పాటు క్రమ శిక్షణా చర్యలు పాటించాలన్నారు. ఎన్‌ఎ సిఎల్ 11.5 మిలియన్ సేఫ్టీ మాన్ హౌర్స్ సాధించారని పేర్కొన్నారు. అలాగే భద్రత అనేది ఇంటి నుండి మొదలు కావాలని ప్రమాదరహిత ఫ్యాక్టరీలలో ఎన్‌ఎసిఎల్ ఫ్యాక్టరీ ఒకటిగా నిలవడం సమిష్టి కృషికి నిదర్శనమని అభినందించారు. వికసిత్ భారత్ కోసం అందరం తప్పని సరిగా భద్రత,ఆ రోగ్యం పాటించాలన్నారు.అనంతరం భద్రతా క్విజ్, వ్యాసరచన, స్లోగన్స్, సేఫ్టీ పోస్టర్స్, ఫైర్ డ్రిల్ పోటీలలో గెలుపొందిన కార్మికులకు, ఈతకోట, గంటి, పలివెల స్కూల్ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ పిడి ఎమ్.తాతారావు, జెవిఎస్ ప్రకాశరావు, సేఫ్టీ ఆఫీసర్ పి.కోటేశ్వరరావు, అన్ని విభాగాల హెచ్‌ఒడిలు, పాఠశాల ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.