ప్రజాశక్తి-మండపేట : స్థానిక సంగమేశ్వర కాలనీ ప్రాథమిక పాఠశాలలోగురువారం నేతాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కణకణ మండే నిప్పుకణం, భారతజాతి వేకువ కిరణం, స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన సూర్యుడు జయంతే కాని వర్ధంతి లేని అమరుడు, ఆజాద్ హింద్ పౌజ్ ను స్థాపించి తెల్లవారి గుండెల్లో నిద్రించిన వీరుడు, స్వాతంత్య్ర సాధనే తన జీవిత ధ్యేయంగా తపించిన భరతమాత ముద్దు బిడ్డ, ఆజాద్ హింద్ ఫౌజ్ జీవగడ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పరాక్రమ దివససందర్భంగా ప్రాథమిక పాఠశాలలో నేతాజీ జయంతి వేడుకలను విద్యార్థులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణిక్యాంబ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
