టీడీపీ మండల అధ్యక్షునికి అధికారులు అభినందన 

Jun 10,2024 16:00 #Konaseema

బండారుకు మంత్రి పదవి కోసం మెర్ల విజ్ఞప్తి.
ప్రజాశక్తి – ఆలమూరు : తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మెర్ల గోపాల స్వామిని మండలంలోని చొప్పెల్లలో సోమవారం పలువురు అధికారులు స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద కలిసి అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా స్థానిక పంచాయితీ కార్యదర్శి ఎం.శ్యాంసుందర్, తన సచివాలయ సిబ్బందితో విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిసి, ఎన్నికల్లో సాధించిన ఘన విజయంపై అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఈ సందర్భంగా మెర్ల మాట్లాడుతూ మీ విధులు మీరు సక్రమంగా నిర్వర్తించుకోవాలని సూచించారు. అలాగే మా సహకారం ఎల్లప్పుడూ మీకు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొత్తపేట ఉమ్మడి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన బండారు సత్యానందరావుకు, టీడీపీ అధినేత చంద్రబాబు క్యాబినెట్ హోదాతో మంత్రి పదవి ఇవ్వాలని పత్రిక పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఇది నా ఒక్కరి కోరికే కాదని, నియోజకవర్గ ప్రజల అందరి ఆకాంక్షగా ఆయన పేర్కొన్నారు. అలాగే బండారు గత ప్రభుత్వాల హయంలో ఎమ్మెల్యేగా సేవలో భాగంగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఆయన కొనియాడారు. అందుకే మంత్రి పదవి ఇచ్చి మరింత అభివృద్ధికి సహకరించాలని అధిష్టానాన్ని ఆయన కోరారు.

➡️