పాపారావు సేవలు ఎనలేనివి

Dec 30,2024 11:00 #ambedkar konaseema

అభినందన సత్కారంలో కమ్మ సంఘ నేతలు
ప్రజాశక్తి – ఆలమూరు : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీ మురళీకృష్ణ సంస్థల అధినేత, కొత్తపేట నియోజకవర్గ రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గం కమ్మ సంఘం గౌరవ అధ్యక్షులు, వంటిపల్లి పాపారావు ప్రజల అభ్యున్నతి కోసం చేస్తున్న సేవలు ఎనలేనివని స్థానిక కమ్మ సంఘం అధ్యక్షులు ఈదల రాంబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఈదల నల్లబాబు, మాజీ సొసైటీ అధ్యక్షులు వంటిపల్లి సతీష్ కుమార్ కొనియాడారు. సోమవారం వారి ఆధ్వర్యంలో సంఘం నాయకులు, సభ్యులు పాపారావును ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలుసుకొని కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పాపారావుకు శాలువాలు కప్పి, పూలమాలతో అలంకరించి ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గన్ని బాబి, నెక్కింటి ప్రసాద్, బొబ్బ రాంబాబు, బొబ్బ వెంకన్న బాబు, బొబ్బ సుబ్రహ్మణ్యం, చిలుకూరి రంగయ్య, గన్ని శ్రీనివాస్, ఉండవిల్లి మురళి, బొబ్బ రత్నాకర్, వైట్ల అభి చౌదరి, వెంకట శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

➡️