అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు
ప్రజాశక్తి-ముమ్మిడివరం
సమగ్ర శిక్షలో పని చేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల జెఎసి డిమాండ్ చేసింది. నగర పంచాయతీ పరిధిలోని స్థానిక కాశి వారి తూము సెంటర్ లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జెఎసి అద్వర్యంలో గురువారం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు.అనంతరం జాతీయ రహదారి 216 పై ర్యాలీగా జిల్లా విద్యాశాఖ కార్యాలయం వరకు వెళ్లి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్బంగా జెఎసి చైర్మన్ వెంకన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వం మారిన న్యాయం జరగలేదని, గత రెండు నెలలుగా వేతనాలు లేక తమ కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మా జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్ రావుకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.