ప్రజలంతా వివాదాలకు దూరంగా ఉండాలి

May 15,2024 22:45

వల్లూరులో పోలీస్‌ కవాతు

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం

ప్రజలంతా వివాదాలకు దూరంగా వుండాలని మండపేట టౌన్‌ సిఐ అఖిల్‌ జమ ఆన్నారు. కపిలేశ్వరపురం మండలంలోని వల్లూరు గ్రామంలో అంగర పోలీస్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో పోలీసు బలగాలతో బుధవారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా మండపేట టౌన్‌ సిఐ అఖిల్‌ జమ మాట్లాడుతూ గ్రామాల్లో ఏ చిన్న వివాదానికి కాలు దువ్వినా ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి ఒక్కరూ లా అండ్‌ ఆర్డర్‌ పట్ల విధేయులై వుండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అంగర ఎస్‌ ఐ అందే పరదేశి తదితరులు పాల్గొన్నారు.

 

➡️