ప్రచార ప్రకటనలపై అనుమతులు తప్పనిసరి

Apr 18,2024 18:52

ఎన్నికల వ్యయ పరిశీలకులతోమాట్లాడుతున్న కలెక్టర్‌ హిమాన్షుశుక్లా

ప్రజాశక్తి-అమలాపురం

ప్రచార ప్రకటనలకు అనుమతి తప్పనిసరని నిబంధనలు అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. గురు వారం స్థానిక కలెక్టరేట్లోని మీడియా సర్టిఫికేషన్‌ సమన్వయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌, సుమిత్‌ దాస్‌ గుప్తా, రాహుల్‌ దింగడా వ్యయ పరిశీలకులతో కలిసి సందర్శించి కేంద్ర నిర్వహణ తీరును ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రచార ప్రకటనల ప్రెస్‌ క్లిప్పింగ్స్‌ రికార్డులు ఆధారంగా పరిశీలించారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యయ పరిశీలకులకు కేంద్రం పనితీరును వివరిస్తూ వివిధ ఎలక్ట్రానిక్‌ ప్రసార మాధ్య మాల్లో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని మీడి యాకు సూచించారు. దీని కోసం కలెక్టరేట్లో జిల్లా స్థాయి మీడియా సర్టిఫి కేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలక్ట్రానిక్‌ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి మంజూరు చేయటంతో పాటు, చెల్లింపు వార్తలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు మీడియా ఉల్లంఘనలను కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకుం టున్నట్లు తెలిపారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు లేదా వాటి తరపున ఎన్నిక ల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలక్ట్రానిక్‌ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు అనుమతి పొందటం కోసం నిర్ణీత నమూనాలో ప్రకటన ప్రసారం చేసే మూడు రోజుల ముం దుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించామన్నారు. గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు, ఇతర వ్యక్తులు ప్రకటనలు ప్రసారం చేసేందుకు ఏడు రోజుల ముందుగా దరఖాస్తు చేసు కోవాలని సూచించామన్నారు. దరఖాస్తు అందిన రెండు రోజుల్లోపు జిల్లా స్థాయి ఎంసిఎంసి కమిటీ అనుమతి మంజూరు చేస్తుందన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా పరిధిలోకి అన్ని రకాల టెలివిజన్‌ ఛానెళ్లు, కేబుల్‌ నెట్వర్క్లు, డిజిటల్‌ డిస్‌ప్లేలు, మొబైల్‌ నెట్వర్క్‌ ద్వారా ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ మెసేజ్లు వస్తాయని, సామాజిక మాధ్యమా లైన ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌, యూట్యూ బ్‌, ఇన్స్టాగ్రామ్‌, వాట్సాప్‌, గూగుల్‌ వెబ్సైట్‌, వికీపీడియా కూడా ఎలక్ట్రా నిక్‌ మీడియా పరిధిలోకి వస్తాయని వివరించారు. సినిమా థియేటర్లు, ప్రయివేటు ఎఫ్‌ఎం రేడియోలు, ఎలక్ట్రా నిక్‌ మాధ్యమంలో ప్రసారమయ్యే, రాజకీయ ప్రచార ప్రకటనలు కూడా తప్పనిసరిగా ముందస్తు ధ్రువీకరణ పొందాల్సి ఉందన్నారు. అనుమతి పొందిన ఆర్డర్‌ నంబర్ను సంబంధిత ప్రకటన పై సూచించాల్సి ఉంటుం దన్నారు. ఎంసిఎంసి అను మతి లేకుండా చేసే ప్రసారాలు, ప్రకట నలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద పరిగణిస్తారని అన్నారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వార్తా పత్రికల్లో అయితే పోలింగ్‌ రోజు, ముందు రోజు తప్ప నిసరిగా ఎంసిఎంసి నుంచి అనుమతి పొందిన తర్వాత మాత్రమే ప్రకటన ప్రచురించాల్సి ఉంటుందన్నారు. ప్రకటన ప్రచురించడానికి రెండు రోజుల ముందుగా సంబంధి త వ్యక్తి లేదా రాజకీయ పార్టీ ప్రతినిధి ఎంసిఎంసి కమిటీని సంప్రదించాలని సూచించారు. ఆ రెండు రోజులూ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ ప్రకటన లను ప్రచురించడానికి వీలులేదని నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల నియమావళిని అనుసరించి చర్య లు తీసుకుంటామని చెప్పారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాలో ప్రకటనలు ప్రసారం చేసేటప్పుడు ఎన్నికల కమిషన్‌ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించాలని సూచించామన్నారు. నిజ నిర్ధారణ లేకుండా ఇతర పార్టీలపై గానీ, ప్రతినిధులపై గానీ ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇవ్వరాదని ఇప్పటికే మీడియాకు తెలియజేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

 

➡️