అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ మహేష్ కుమార్
ప్రజాశక్తి – అమలాపురం
జిల్లావ్యాప్తంగా పట్టా భూములలో ఉన్న ఇసుక తవ్వకాలకు సంబంధించి దరఖాస్తులపై ప్రాధాన్యత క్రమంలో సర్వే నిర్వహిం చి అనుమతులు మం జూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కమిటీ సభ్యులను ఆదేశించారు. బుధ వారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ కమిటీ అధ్యక్షులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇసుక రీచులలో త్రవ్వకాలను సాధ్యమైనంత ఎక్కువగా నిర్వహిస్తూ స్టాక్ యార్డులలోనూ వినియోగదారుల డిమాండ్ కు అనుగుణంగా సరఫరా చేయాలని ఆదేశించారు. సెమీ మేకనైజ్డ్ రీచుల నుండి లక్ష్యాలకు అనుగుణంగా స్టాక్ యార్డ్లకు ఇసుకను ఎక్కువగా తరలించాలని ఆదేశించారు. కొత్తగా ఏజెన్సీలు నియమించిన మూడు రీచులలో వారం రోజులలో ఇసుక త్రవ్వకా లు ప్రారంభించాలని ఆదేశించారు. ఎక్కడ అక్ర మంగా ఇసుక తరలింపునకు ఆస్కారం లేకుండా సిసి కెమెరాల నిఘా, పర్యవే క్షణ వ్యవస్థలను బలో పేతం చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ తవ్వకాలు పేరిట వివిధ ప్రసార మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవాలు, ప్రతికూల వార్తలపై క్షేత్రస్థాయిలో విచారించి వాస్తవాలతో రీజాయిం డర్స్ (ఖండన వార్త) తయారుచేసి సంబం ధిత పత్రికలకు విడుదల చేయాలన్నారు. వివిధ ప్రతిపాదనలకు సం బంధించి జాయింట్ తనిఖీలు త్వరితగతిన నిర్వహించి తవ్వకాలు కొరకు మైనింగ్ ప్లాన్ పర్యావరణ అనుమతు లను జారీ చేయాలన్నా రు. భవన నిర్మాణ రంగ డిమాండ్ కు అనుగుణం గా ఇసుక సరఫరా ఉండా లని, భవన నిర్మాణ రం గానికి సమద్ధిగా ఇసుక సరఫరా చేయాలన్నారు. జిల్లా రవాణా అధికారి ఇసుక టోకెన్ల జారీకు అనుగుణంగా సకాలంలో ఇసుక రవాణా అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఇసుక తవ్వకాలకు అనువైన రీచ్ లను కూడా గుర్తించాలని సూచించారు. ఇసుక నాణ్యత, పరిమా ణం అక్రమ రవాణా అక్రమ త్రవ్వకాలు తదితర అంశాలపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ఉచిత ఇసుక నిర్వహణ పాలసీ కి అనుగుణంగా విని యోగదారులకు బుకింగ్ అంశాలపై మరింత అవ గాహన పెంపొందించాలన్నారు. ఈ కార్యక్ర మంలో జెసి టి.నిషాంతి, ఆర్‌డిఒలు శ్రీకర్, కె.మాధవి, డి.అఖిల, జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి ఎల్.వంశీధర్ రెడ్డి, రియాల్టీ ఇన్‌స్పెక్టర్ టి.సుజాత, జిఎస్‌డబ్ల్యూఎస్ కోఆ ర్డినేటర్ సువిజరు, తదితరులు పాల్గొన్నారు.