అక్రమ ఇసుక తవ్వకాలపై హైకోర్టులో పిటిషన్

Feb 10,2024 15:09 #Konaseema
petition on illegal mining

ప్రజాశక్తి-రామచంద్రపురం : కే గంగవరం మండలంలో గోదావరి పరివాహక ప్రాంతo లో కొనసాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై రాష్ట్ర హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశామని ఎర్రంశెట్టి రామరాజు తెలియజేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఉల్లంగించి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరంమండలం, పాతకోట, బట్లపాలిక, మసకపల్లి, గ్రామ పంచాయితీల పరిధిలో ఉన్న గోదావరి నది పరివాహక ప్రాంతాలలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు నిలుపుదల చేయమని కోరుతూ, మరల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిటి పిటేషన్ వేసినట్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి యర్రంశెట్టి రామరాజు తెలియజేశారు. దీనిపై అధికారులు పట్టించుకోకపోవడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

➡️