పలు గ్రామాల్లో ఘనంగా ప్రభల తీర్థం

Jan 16,2025 18:01
rrrr

శ్రీరామపురంచెరువు వద్ద ఉత్సవమూర్తులతో ప్రభల తీర్థం

ప్రజాశక్తి – కపిలేశ్వరపురం

మండలంలోని మాచర పంచాయతీ శివారు శ్రీరామపురం చెరువు వద్ద, కోరుమిల్లి ఏటి గట్టు వద్ద, పడమర కండ్రిక పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద, గురువారం ప్రభల తీర్థం ఘనంగా నిర్వహించారు. .సంక్రాంతి వేడుకల్లో చివరి రోజైన ముక్కనుమ సందర్భాన్ని పురస్కరించుకొని కపిలేశ్వరపురం, టేకి, మాచర, శ్రీరామపురం, అంగర తదితర గ్రామాల్లో ప్రత్యేకంగా ఉత్సవ మూర్తులతో అలంకరించిన ప్రభలను శ్రీరామపురం చెరువు వద్దకు చేర్చి తీర్థం నిర్వహించారు .అధిక సంఖ్యలో మహిళలు, యాత్రికులు, పాల్గొని స్వామివారికి నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు .అనంతరం గ్రామాల్లో ప్రభలను ఊరేగి స్తూ యాత్రికులు నుంచి నైవేద్యాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన భక్తులు ,అధిక సంఖ్యలో మహిళలు, పాల్గొన్నారు .

 

➡️