కౌంటింగ్‌కు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ ఏర్పాటు

May 24,2024 23:15

ప్రజాశక్తి-కాట్రేనికోన

జూన్‌ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు దృష్ట్యా శ్రీనివాస ఇంజనీరింగ్‌ కళాశా లో హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. శుక్రవారం కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలోని శ్రీనివాస ఇంజనీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ ఏర్పాట్లను జిల్లా స్థాయి అధికారులతో కలిసి అయన తనిఖీ నిర్వహించారు కౌంటింగ్‌ కేంద్రా ల్లోనికి ప్రవేశించే మార్గాలు, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం 360 డిగ్రీల పరిధిలో సిసి కెమెరాల అమరిక, పోటీలో ఉన్న అభ్యర్థులకు, కౌంటింగ్‌ ఏజెంట్ల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లు తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛా యుత వాతావరణంలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహిం చేందుకు అన్ని చర్యలు పకడ్బందీగా చేపట్టినట్లు వెల్లడించారు. కౌంటింగ్‌ ప్రక్రియ కు సంబంధించి పూర్తి వసతులు సమకూరుస్తున్నట్లు తెలిపారు పోటీలో ఉన్న అభ్యర్థుల ఏజెంట్ల సౌకర్యార్థం 20 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్‌ సూపరింటెం డెంట్‌ ఇంజనీర్‌ సురేష్‌ బాబు ను ఆదేశించారు. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని ట్రాన్స్‌కో ఇఇ రవికుమార్‌ను ఆదేశించారు. హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ ఏర్పాటు చేయాలని బిఎస్‌ఎన్‌ఎల్‌ ఇంజినీర్లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ సూపరిం టెండెంట్‌ ఎస్‌.శ్రీధర్‌, పంచాయతీరాజ్‌ సూపరిం టెండెంట్‌ ఇంజినీర్‌ కె.చంటిబాబు, ఆర్‌ అండ్‌ బి ఎస్‌సిి బి.రాము తదితరులు పాల్గొన్నారు.

➡️