వర్షాలు.. వరి కష్టాలు

May 16,2024 13:16 #Konaseema
  • అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు
    వేసవి తాపానికి చెక్
    నిలిచిపోయిన ధాన్యం ఎగుమతులు

ప్రజాశక్తి-రామచంద్రపురం : అల్పపీడన ప్రభావంతో గురువారం ఉదయం నుండి వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. దీంతో వేసవి తాపానికి చెక్ పెట్టినట్లు అయింది. ఉదయం నుండి కురుస్తున్న వర్షాల వల్ల వేసవి ఉష్ణోగ్రతల నుండి ప్రజలు ఉపశమనం పొందారు. మరోవైపు వర్షాలు కురవడంతో దాల్వా వరి ధాన్యం ఎగుమతులు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. రైతులు రోడ్ల వెంబడి బరకాల కప్పుకుని ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారు. మరో మూడు రోజులపాటు అల్పపీణ ప్రభావ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో వ్యవసాయ పనులన్నీ నిలిచిపోనున్నాయి. అదేవిధంగా ధాన్యం ఎగుమతులు ఎక్కడికి అక్కడ ఆగిపోయాయి. ఏది ఏమైనా వాతావరణం కాస్త చల్లబడడంతో వృద్ధులు పిల్లలు చల్లదానానికి సేద తీరారు. 40 డిగ్రీలలో నమోదైన ఉష్ణోగ్రతలు గురువారం 29 డిగ్రీలకు చేరుకున్నాయి.

➡️