కాలేరు రెవెన్యూ సదస్సులో మాట్లాడుతున్న తహశీల్దార్ చిన్నారావు
ప్రజాశక్తి – యంత్రాంగం
జిల్లాలోని పలు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు శుక్రవారం నిర్వహించారు. అధికారులు పాల్గొని రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. కపిలేశ్వరపురం : భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని తహశీల్దార్ పి.చిన్నారావు అన్నారు. శుక్రవారం కాలేరు పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ దాయం కావేరి శేఖర్ బాబు అధ్యక్షతన జరిగిన రెవెన్యూ గ్రామసభలో మండల ప్రత్యేక అధికారి, డిఎల్‌డిఒ కామేశ్వరరావు, తహశృల్దార్ చిన్నారావు మాట్లాడుతూ భూ సమస్యల పై రైతులు దరఖాస్తు చేసుకుంటే వాటిని త్వరితగతిన పరిష్కారానికి కషి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ సమస్యలపై రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, ఆన్లైన్ చేశారు. అధికారులు సిబ్బంది కొద్ది సేపు గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ అర్జమ్మ, కార్యదర్శి యు. సుప్రియ, విఆర్‌ఒలు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, రైతులు, తదితరులు, పాల్గొన్నారు మామిడికుదురు : భూ సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని మండల ప్రత్యేక అధికారి ఎస్‌జెవి రామ్మోహన్‌రావు, తహశీల్దార్ వైవి.సుబ్రహ్మణ్యాచార్యులు అన్నారు ఆదుర్రు కళ్యాణ మండపంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి త్వరలో పరిష్కరిస్తామని తహశీల్దార్ తెలిపారు ఈ కార్యక్రమంలో బళ్ళ శ్రీనివాస్, పలు శాఖ ల అధికారులు పాల్గొన్నారు. అమలాపురం రూరల్:కామనగరువు గ్రామపంచాయతీ వద్ద శుక్రవారం గ్రామ సర్పంచ్ నక్కా అరుణ కుమారి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కిషోర్ బాబు పాల్గొని మాట్లాడుతూ గ్రామాలలోని భూ సమస్యలను పరిష్కరించడానికి ఈ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజులపూడి భాస్కరరావు, మాజీ సర్పంచ్ రాజులపూడి భీముడు, ఆర్.సత్యనారాయణ, కార్యదర్శి సూరపరాజు, విఆర్‌ఒలు బాలాజీ, పి వెంకటేశ్వరరావు, జెఎబిసి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.