సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షురాలు శాంతకుమారికి సత్కారం

Jun 10,2024 22:34

శాంతకుమారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న టిడిపి, జనసేన నాయకులు

ప్రజాశక్తి – అంబాజీపేట

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షురాలు మాచవరం సర్పంచ్‌ నాగాబత్తుల శాంతా కుమారి సుబ్బారావు పుట్టినరోజు వేడుకలు సోమవారం ఆమె స్వగహం వద్ద పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. టిడిపి జనసేన నాయకులు కేకు కట్‌ చేసి శాలువతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజవర్గ కన్వీనర్‌ నామన రాంబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు, టిడిపి నియోజకవర్గ కో కన్వీనర్‌ సత్యనారాయణ, మాజీ జడ్పిటిసి బొంతు పెదబాబు, పిఎసిఎస్‌ మాజీ అధ్యక్షులు గణపతి వీరరాఘవులు, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ సుంకర బాలాజీ, మహిపాల తాతాజీ పెదపూడి శ్రీను, అరిగెల సూరిబాబు, ఉప సర్పంచ్‌ సుంకర పేరయ్య నాయుడు, పబ్బినీడి రాంబాబు ,కొప్పినీడి ఈశ్వరరావు, గుడాల ఫణి, మంద రాజేష్‌,కత్తుల బాబులు,కాసా నాగ మల్లేశ్వరరావు,దళిత నాయకులు పులిదిండి సత్యనారాయణ,తదితరులు పాల్గొని సర్పంచ్‌ శాంతకుమారి కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

➡️