హైస్కూల్‌కు ఫర్నీచర్‌ అందజేసిన ఎస్‌బిఐ

Feb 5,2025 18:13
furniture

ఫర్నీచర్‌ రూమ్‌ ప్రారంభిస్తున్న మాజీ డిసి అధ్యక్షుడు వెంకటరత్నం

ప్రజాశక్తి – ఆలమూరు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రాజ మ హేంద్రవరం రీజినల్‌ ఆఫీస్‌ వారు సామాజిక బాధ్య తలో భాగంగా సిఎస్‌ఆర్‌ నిధుల నుంచి మండలంలోని చెము డులంక ఎస్‌టిఎస్‌ ఎన్‌ఎమ్‌ జడ్‌పి ఉన్నత పాఠశాలకు రూ.5 లక్షల విలువైన ఫర్నీ చర్‌ను బుధవారం అందజేశారు. హైస్కూల్‌ విద్యార్థులకు అవసరమైన 18 బెంచీలు, రెండు కంప్యూటర్లతో పాటు నాలుగు బీరువాలు, పది ఉపాధ్యాయుల టేబుల్స్‌, కుర్చీలు, మైకు సిస్టమ్‌ వంటివి ఉన్నాయి. వీటన్నిటిని రీజనల్‌ మేనేజర్‌ తాడపత్రి శ్రీనివాస్‌ సమక్షంలో ఫర్నీచర్‌ రూమును ప్రారంభించి పాఠశాల హెచ్‌ఎం భమిడిపాటి శివరామకృష్ణకు అందజే శారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌, ఆలమూరు మండల టిడిపి వాణిజ్య విభాగ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకటరత్నం, ఎంపిటిసి సభ్యుడు తమ్మన భాస్కరరావు, టిడిపి నాయకులు నాగిరెడ్డి సత్యా నందం, కొత్తపల్లి రాంబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️