లైసెన్స్‌ లేని బాణసంచా సీజ్‌

Oct 8,2024 23:22
సమావేశంలో మాట్లాడుతున్న సిఐ భీమరాజు

సమావేశంలో మాట్లాడుతున్న సిఐ భీమరాజు

ప్రజాశక్తి-అంబాజీపేట

దీపావళి సందర్భంగా తాత్కాలిక లైసె న్స్‌ లేకుండా బాణసంచాను నిల్వ చేస్తే పటిష్టమైన సమాచారంతో అటువంటి వాటిని గుర్తించి సీజ్‌ చేస్తామని పి.గన్నవరం సీఐ ఆర్‌.భీమరాజు అన్నా రు. దీపావళి సందర్భంగా అంబాజీపేట పిఎస్‌లోతాత్కాలిక లైసెన్స్‌ ద్వారా బాణసంచా విక్రయించే వ్యాపారులను సమావేశ పరచి మంగళవారం పలు సూచనలు చేశారు. ముందస్తు లైసెన్స్‌ లేకుండా శివకాశి, ఇతర ప్రాంతాల నుంచి బాణసంచా దిగుమతి చేసుకుని నిల్వ చేయడం నేరమన్నారు. తాత్కాలిక లైసెన్స్‌ పొందే వరకు వ్యాపారస్తులు ఎటువంటి బాణసంచా సామగ్రి దిగుమతి చేసుకోరాదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ కె.చిరంజీవి పాల్గొన్నారు.

➡️