రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు పలువురి అభినందన
ప్రజాశక్తి-అమలాపురం
ఇటీవల కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి సపక్ తక్ర ఆటల పోటిల్లో అమలాపురం స్థానిక కొంకాపల్లి జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ , విద్యార్థులు అప్పారి పవన్, అప్పారి యశ్వంత్(అప్పారి బ్రదర్స్) పేరూరి రోహిత్ సాయి ఫణీంద్ర రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే జెఎన్ మున్సిపల్ హై స్కూల్ కొంకాపల్లి విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అవడం పట్ల అమలాపురం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జి.సూర్య ప్రకాశం, ఎంఇఒ దుర్గాదేవి, మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్యనాగేంద్ర మణి, మున్సిపల్ కమిషనర్ రాజు, 20వ వార్డు కౌన్సిలర్ తిక్కా సత్యలక్ష్మి ప్రసాద్, పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ వానపల్లి ముక్కోటి రాంబాబు, మంచిగంటి వెంకటేశ్వరరావు విద్యార్థులను అభినందించారు, రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. ఘన సత్యనారాయణ, ఉపాధ్యాయులు బి.ఎన్.వెంకటేశ్వరరావు, కె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.