మహిళలకు స్వయం ఉపాధి : మంత్రి సుభాష్‌

Oct 30,2024 22:53
మహిళలకు స్వయం ఉపాధి : మంత్రి సుభాష్‌

ప్రజాశక్తి-రామచంద్రపురం 134 మంది వితంతువులకు స్వయం ఉపాధి కల్పించి ఇండిస్టియల్‌ పార్కును ఏర్పాటు చేసి చిన్న పరిశ్రమల నుంచి, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందేందుకు ఏర్పాట్లు చేశామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తెలిపారు. బుధవారం స్థానిక లయన్స్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలకు అతీతంగా 134 మంది వితంతులను గుర్తించి, స్మాల్‌ స్కేల్‌ ఇండిస్టీలు స్థాపించుటకు అవగాహన, రిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ధులు బ్యాంకు ద్వారా రుణం, ుగిలిన భాగం తాను వ్యక్తిగతంగా వేసుకుంటానని, అవసరమైతే దాతల సహకారం తీసుకుంటామని వివరించారు. ఇండిస్టియల్‌ పార్కు నిర్మాణం కోసం రామచంద్రపురం దగ్గరలో 5 ఎకరాల స్థలం గుర్తించి రెవెన్యూ అధికారుల ద్వారా ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా అభివృద్ధి ధ్యేయంగా, మహిళల స్వయం ఉపాధి కోసం సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సహాయ సహకారం, ప్రోత్సాహం ఉందన్నారు. 10 మంది మహిళా సభ్యులను గ్రూపుగా ఏర్పాటు చేసి, గ్రూపు పర్యవేక్షణ కోసం ఒక ఇన్చార్జిని నియమిస్తామన్నారు. చిన్న తరహా పరిశ్రమలపై అవగాహన కల్పించేందుకు పూర్తిస్థాయి శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన, వారి అవసరాలు తీరడంతో పాటు స్వశక్తితో ఎదుగుతారన్నారు. రూ.లక్ష నుంచి రూ.పది లక్షల వరకు పరిశ్రమల ఆధారంగా రుణాల మంజూరుకు కృషి చేస్తామన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఉపాధి కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పిఎంఇజిపి పథకం ద్వారా ఎనిమిదవ తరగతి పాస్‌ అయితే రూ.50 లక్షల వరకు రుణం మంజూరు చేస్తుంన్నారు. అందులో 35 శాతం అంటే 18 లక్షలు సబ్సిడీగా ఉంటుందన్నారు. ఎనిమిదవ తరగతి లోపు చదువుకున్న వారికి రూ.10 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన పార్టీ ఇన్‌ఛార్జి చంద్రశేఖర రావు, చిర్రా రాజకుమార్‌, బత్తుల విజరు కుమార్‌, సుందరపల్లి జానకిరామ్‌, సయ్యద్‌ చాన్‌ బాబు, హేమంత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️