ఘనంగా సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జయంతి

May 15,2024 22:42

ఉచ్చిలిలో కాటన్‌ విగ్రహానికి నివాళులుఅర్పిస్తున్న రైతులు

ప్రజాశక్తి-యంత్రాంగం

రైతు బాంధవుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జయంతిని జిల్లాలో పలుచోట్ల బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల కాటన్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులుఅర్పించారు. ఆత్రేయపురం: ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి బీడు భూములను సాగు సాగు భూములుగా మార్చి అన్నప్రదాతగా రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడని రైతులన్నారు. బుధవారం ఆయన జయంతి సందర్భంగా మండల ప్రజా పరిషత్‌ వద్ద , ఉచ్చిలి కాలు రేవు వద్ద నల్ల లాకుల వద్ద రైతులు ఆయన విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గోదావరి జలాలను పొలాలకు తరలించి పరివాహక జిల్లాలను సస్యశ్యామలం చేసిన రైతు బాంధవుడు, కాటన్‌ దొరగా డెల్టా ప్రాంత ప్రజల గుండెల్లో కొలువైన భగీరధుడు, నిస్వార్థ ప్రజా సంక్షేమ నిరతుడు. సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ అని కొనియాడారు. మామిడికుదురు: బీడు భూములను సత్యశ్యామలముగా చేసినసర్‌ అర్థర్‌ కాటన్‌ సేవలు చిరస్మరణీయమని పలువురు రైతులు అన్నారు మామిడి కుదురు తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో కాటన్‌ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం కాటన్‌ విగ్రహానికి కుసుమ అప్పారావు పూలమాలవేసి నివాళులర్పించారు. ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన కాటన్‌ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు రెవెన్యూ, సిబ్బంది పాల్గొన్నారు. మామిడికుదురు: రైతులు కాటన్‌ మహశ్రయుని ఆదర్శంగా తీసుకొని సాగునీటి వనరులు సద్వినియోగం చేసుకోవాలని జెడ్‌పి సిఇఒ, పి.గన్నవరం నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శ్రీరామచంద్రమూర్తి అన్నారు. కాటన్‌ జయంతి సందర్భంగా పి.గన్నవరంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద కాటన్‌ విగ్రహానికి బుధవారం ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌, డిప్యూటీ తహశీల్దార్‌, మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️