ఆటలతో ఆరోగ్యం పోటీల ప్రారంభం

Jan 7,2025 23:41
ఆటలతో ఆరోగ్యం పోటీల ప్రారంభం

ప్రజాశక్తి-యంత్రాంగం క్రీడలు శారీరక మానసిక ధృడత్వానికి దోహదం చేస్తాయని పలువురు అన్నారు. మంగళవారం ‘ఆటలతో ఆరోగ్యం’ క్రీడోత్సవాలను జిల్లావ్యాప్తంగా ప్రారంభించారు. రామచంద్రపురం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ నియోజకవర్గంలోని కె.గంగవరం మండలంలోని పామర్రు హైస్కూల్లో క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ కోనసీమ సంక్రాంతి క్రీడోత్సవం కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక బలానికి మార్గం, శారీరక దఢత్వానికి పునాది అన్నారు. క్రీడలు మన జీవితంలో కేవలం వినోదం మాత్రమే కాదు, నిబద్ధత, జట్టుగా పని చేయడం, మానసిక స్థైర్యం వంటి విలువల్ని నేర్పించే సాధనం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పంపన నాగమణి పాల్గొన్నారు. అమలాపురం విద్యా బోధనతో పాటు ఆసక్తిగల క్రీడలలో ఉత్సాహంగా పాల్గొని, పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు. కొమరగిరిపట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆయన క్రీడ ఉత్సవాల పోటీలను ప్రారంభించారు. మండల స్థాయిలో 4, 5, 6 తరగతుల విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు మెడల్‌, ప్రశంసా పత్రాలు అందిస్తామని, మండల స్థాయిలో గెలుపొందిన వారు జిల్లాస్థాయి పోటీలలో పాల్గొంటారని జిల్లా స్థాయిలో నిలిచిన విజేతలకు మెడల్స్‌ ప్రశంసా పత్రాలను బహూకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు పిఎస్‌ సురేష్‌ కుమార్‌, ఎంపిడిఒ కృష్ణమోహన్‌, స్థానిక ప్రజాప్రతినిధులు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.మామిడికుదురు నిత్యం సెల్‌ఫోన్లతో గడుపుతూ మానసిక ఒత్తిడికి గురవుతున్న పిల్లలలో క్రమశిక్షణ, ఆరోగ్యం పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని పి.గన్నవరం ఎంఎల్‌ఎ గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. మామిడికుదురు హైస్కూల్‌ ఆవరణలో క్రీడలను ఎంఎల్‌ఎ ప్రారంభించారు. మండల పరిధిలో 12 పాఠశాలల నుంచి 130 మందికి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కుసుమ వనజకుమారి, నామన రాంబాబు, పి.గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు అడబాల తాత కాపు, పెదపట్నంలంక సర్పంచ్‌ సుందరనేడి రాజేష్‌ కుమార్‌ (చిన్ని), ఎంపిటిసి కొమ్ముల జంగమయ్య, బోనం బాబు, జనసేన మండల అధ్యక్షుడు జాలెం శ్రీనివాసరాజా, పాశర్లపూడి ఉప సర్పంచ్‌ తుండూరి బుజ్జి, ఎంఇఒలు లక్ష్మీనారాయణ, వెంకన్న బాబు, ఎంపిడిఒ కె.వెంకటేశ్వరరావు, హెచ్‌ఎం సిహెచ్‌.నిరంజని పాల్గొన్నారు.ముమ్మిడివరం జెడ్‌పిటిసి కుడిపూడి శివ శంకర రావు నగర పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో క్రీడా పోటీలను తొలి తోజు క్రీడలలో వాలీబాల్‌లో ముమ్మిడివరం గేదెలంక జెడ్పి బాలుర పాఠశాలలు, కబాడీ పోటీలలో ముమ్మిడివరం బాలికలు, గాడిలంక బాలికలు ఫైనల్‌ పోటీలకు ఎంపికైయ్యారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి డి.శాంతిలక్ష్మి, ఎంపిడిఒ టిఎస్‌.వెంకటాచార్య, ఎంఇఒ ఆర్‌.ఉదయభాస్కర్‌ ఇఒపిఆర్‌డి సిహెచ్‌.లకీë కల్యాణి, హెచ్‌ఎం బి.హనుమంత రావు, సిహెచ్‌.పరిమళ, పీడీ రాంబాబు, రమాదేవి, సుజాత, విజయ కుమారి ఇందిరా ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.ఆత్రేయపురం మహాత్మా గాంధీ కళాశాల మైదానంలో క్రీడా పోటీలను మండల ప్రత్యేకాధికారి వెంకటరామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ బికెఎస్‌ఎస్‌.వెంకట్‌ రామన్‌, ఎంఇఒలు వరప్రసాదరావు, పచ్చ సాహెబ్‌, పరిపాలన అధికారి రామ స్వరూప్‌ పాల్గొన్నారు.ఉప్పలగుప్తం భీమనపల్లి జెడ్‌పి ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జెడ్‌పిటిసి గెడ్డం సంపదరావు పోటీలను ప్రారంభించారు. వివిధ విభాగాల ఆటల పోటీలను సర్పంచ్‌ పెయ్యల రాజ్‌కుమార్‌, ఎంపిటిసిలు దేశంశెట్టి నాగరత్నకుమారి, నాగులపల్లి శేషవేణి, ఎస్‌ఎంసి చైర్మన్‌ గుర్లింక చిన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మంచెం బాబి, యాళ్ల సత్తిబాబు, మండల ప్రత్యేకాధికారి ఎంఎ.షంషీ, ఎంపిడిఒ పిఆర్‌సి రాజ్‌ కుమార్‌, హెచ్‌ఎం ఎన్‌.సత్యనారాయణ, పీడీలు కామన ప్రభాకరరావు, గొలకోటి ఫణీంద్ర కుమార్‌, పి.విగేశ్వరుడు, కరాటం ప్రసాద్‌, సీతాపతి, సురేష్‌, వి.కుమార్‌, వి.విజయభాస్కర్‌, డి.సరస్వతి, ఎ.ఐశ్వర్య పంచాయతీ కార్యదర్శి పెట్టా నాగేశ్వరరావు పాల్గొన్నారు. అయినవిల్లి ఎంఎల్‌ఎ గిడ్డి సత్యనారాయణ సిరిపల్లి శ్రీజయంతి రామయ్య పంతులు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి గన్నవరపు శ్రీనివాసరావు, తహశీల్దార్‌ నాగలక్ష్మి, ఎంపిడిఒ జి.భీమారావు, అయినవిల్లి సర్పంచ్‌ కాకర శ్రీనివాసరావు, కూటమి నాయకులు మద్దాల చంటిబాబు పాల్గొన్నారు.ఆలమూరు టిడిపి మండల అధ్యక్షుడు మెర్ల గోపాల స్వామి, ఎంపిడిఒ ఎ.రాజు, ఎంఇఒ బి.అప్పాజీ కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోటీలను ప్రారంభించారు. పోటీలకు అబ్జర్వర్‌గా కోనసీమ ఇండిస్టీస్‌ జిఎం ఆర్‌కెపి.ప్రసాద్‌ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నాతి లావణ్య కుమార్‌ రాజా, ఎఎంసి మాజీ చైర్మన్‌ ఈదల నల్లబాబు, ఈదల సత్తిబాబు, సర్పంచులు ఏడిద సత్యశ్రీ మెహర్‌ ప్రసాద్‌, తోట భవాని వెంకటేశ్వర్లు, పీడీలు సత్తిబాబు, గంగవేణి పాల్గొన్నారు.కాట్రేనికోన మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని డిఇఒ షేక్‌ సలీం బాషా పేర్కొన్నారు. కాట్రేనికోన జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో క్రీడలను ఆన మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి నేల కిషోర్‌ కుమార్‌, సర్పంచ్‌ గంటి వెంకట సుధాకర్‌, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ నాగీడి నాగేశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు, విత్తనాల బుజ్జి, ఎంపిడిఒ వెంకటాచలం, విద్యాశాఖ అధికారి వెంకటరమణ పాల్గొన్నారు.

➡️