విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

Nov 30,2024 11:43 #ambedkar konaseema

ప్రజాశక్తి-రాజోలు: విద్యార్థులు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలంటే నైపుణ్యాలపై అవగాహన పెంచుకోవాలని 1ఎం 1బి.స్టేట్ ఇన్చార్జి సాగర్ అన్నారు. శనివారం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని వివేకానంద ఉన్నత పాఠశాలలో 1ఎం 1బి సంస్థ ఆధ్వర్యంలో గ్రీన్ క్లబ్ ఏర్పాటైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సాగర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, వ్యర్థాల పునర్వినియోగం వంటి అంశాలపై యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పించి సమాజంలో మార్పు తేవడమే తమ సంస్థ లక్ష్యమని చెప్పారు. పాఠశాలలో వ్యర్థాల నుంచి రూపొందించిన ప్రాజెక్టును పి.బి.సాధిక, ఎం.రోజలిన్లు తమ తోటి విద్యార్థులకు వివరించారు. ప్రిన్సిపల్ పీవీవీ ప్రసాద్, ఉపాధ్యాయులు శ్యాంప్రసాద్, ఫణిలక్ష్మి, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️