విద్యార్థినిలతో మాట్లాడుతున్న రజనీ
ప్రజాశక్తి – అమలాపురం రూరల్
విద్యార్థినులు లక్ష్య్నాన్ని నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహి ంచాలని మాతా రమాబాయి అంబేద్కర్ ఫౌండేషన్ చైర్ పర్సన్ పుణ్యమంతుల రజిని పేర్కొన్నారు. బుధవారం అల్లవరం మండలం గోడి సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ లో ఆమె ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు విద్యార్థినిలకు బాలికల సంరక్షణ, విద్య దాని ప్రాధాన్యత పై మోటివేషన్ క్లాస్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ కేవలం చదువు ఒకటే సమాజం లో గౌరవాన్ని, ఉన్నత స్థాయిని తెచ్చిపెడుతుందని హితవు పలికారు.బాలికల సంరక్షణపై విద్యార్థినిలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. మాజంలో ప్రతి ఆడపిల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మాట వింటూ చక్కగా చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ యస్.కిరణ్మయి, వైస్ ప్రిన్సిపల్ వెంకటేశ్వరమ్మ, ఉపాధ్యాయినులు, ఎస్‌ఎంసి సభ్యులు జంగా శ్రీను, ఫౌండేషన్ సభ్యులు విప్పర్తి లక్ష్మీ సరస్వతి, గుర్రాల సుజాత, గోడ భాగ్యలక్ష్మి, గోడ రమాదేవి, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.