ఇసుక స్టాక్‌పాయింట ్‌తనిఖీ చేస్తున్న కలెక్టర్ మహేష్‌కుమార్
ప్రజాశక్తి – రావులపాలెం
డిమాండ్ కు అనుగుణంగా ఇసుకను సరఫరా చేసే విధంగా చర్య లు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఇసుక తవ్వకాలు నిర్వహించే గుత్తేదా రులను ఆదేశించారు. శని వారం రావులపాలెం మం డలం ఊబలంక వద్ద ఆర్‌ఎస్ ఆర్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఇసుక స్టాక్ పాయింట్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తుందని, ఎటు వంటి అవకతవకలు లేకుండా నిర్దేశించిన మేరకు ఇసుక తవ్వకాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఊబలంక ఇసుక ర్యాంపు నుంచి సుమారు 64,800 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వ కాలకు అనుమతి ఇచ్చామన్నారు. ప్రతిరోజు 500 మెట్రిక్ టన్నుల మేర ఇసుకను తవ్వి వినియోగదారులకు అందుబాటులో ఉంచే విధంగా సంబంధిత ఏజెన్సీలను ఆదేశించా మన్నారు. స్టాక్ పాయింట్ వద్ద రాత్రింబవళ్లు ఇసుక కార్యకలాపాలు జరిగేలా ఏజెన్సీ లు చూడాలన్నారు. ఇసుక ర్యాంపు వద్ద మాత్రం నిర్దేశించిన సమయంలోనే తవ్వకాలు జరగాలన్నారు. ఎట్టి పరిస్థితి లోనూ ఇసుకను అవసరమైన వారందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ బియం.ముక్తే శ్వరరావు, మైన్స్ అధి కారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.