అమలాపురం ఎంపీ, ఎంఎల్‌ఎ చేతులు మీదుగా అవార్డులు అందుకుంటున్న సర్పంచ్, కార్యదర్శులు
ప్రజాశక్తి – అంబాజీపేట
స్వచ్ఛతా భారత్ దివాన్ ను పురస్కరించుకొని స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా మాచవరం గ్రామాన్ని అత్యంత పరిశుభ్రత గ్రామంగా గుర్తిస్తూ అంబాజీపేట మండలం మాచవరం సర్పంచ్ నాగాబత్తుల శాంతాకుమారి సుబ్బారావు , గంగలకుర్రు కార్యదర్శి ఎన్.సత్యవేణి మాచవరం స్వీపర్ లకు అవార్డులను గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో బుధవారం అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, అమలాపురం ఎంఎల్‌ఎ అయిదాబత్తుల ఆనందరావు చేతుల మీదుగా అందుకున్నారు. మాచవరం,గంగలకుర్రు గ్రామాలని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు పరిసరాల పరిశుభ్రత కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిఆర్‌ఒ వెంకటేశ్వర్లు, డిపిఒ దుండి రాంబాబులు సూచించారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులను వారు అభినందించారు.