బహుమతులు అందుకున్న ప్రతిభ చూపిన ఉపాధ్యాయులు
ప్రజాశక్తి-యంత్రాంగం
గుంటూరులోయుటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. ఈపోటీలు పలువురు ఉపాధ్యాయులు పాల్గొని ప్రతిభ చూపారు. వీరికి పలువురు అభినందనలు తెలిపారు. అమలాపురం : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) స్వర్ణోత్సవాల సందర్భంగా ఉపాధ్యాయులకు గత నెల్లో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ నెల 4,5, 6 తేదీల్లో గుంటూరులో ఎన్‌టిఆర్ స్టేడియం నందు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఆటల పోటీలలో పాల్గొని విజేతలు నిలిచిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను యుటిఎఫ్ డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ అభినందనలు తెలియజేసింది. స్పీడ్ వాక్ నందు మూడవ బహుమతి అందుకున్న బి.ఇందిర,100 మీటర్స్ రన్నింగ్, షాట్ పుట్ మొదటి, రెండవ బహుమతులు అందుకున్న ఎం.సురేష్ బాబు, జావిలన్‌త్రో నందు రెండో బహుమతి అందుకున్న మంగతాయారు, టెన్నికాయిట్, త్రోబాల్ నందు రెండో బహుమతి అందుకున్న ఉపాధ్యాయినిల బృందానికి జిల్లాశాఖ అధ్యక్షులు పెంకే వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎంటివి ఎ ఎస్.సుబ్బారావు అభినందనలు తెలియజేశారు.ఉప్పలగుప్తం: గుంటూరులో యుటిఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడల్లో చల్లపల్లి పంచాయతీ వాసాలతిప్ప జెడ్ పి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎం.సురేష్ బాబు తన ప్రతిభ చూపారు. టీచర్స్ ఒలింపిక్స్ క్రీడల్లో100 మీటర్ల రన్నింగ్‌లో డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫున మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ ,షాట్ పుట్‌లో రెండవ స్థానం లో నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు. ఆదివారం సురేష్ బాబును యుటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు అత్తిలి సురేష్ కుమార్ కార్యదర్శి ఎవి.సూర్యం, యుటిఎఫ్ నాయకులు గుత్తుల సుబ్ర హ్మణ్యం, కామన మధుసూదనరావులతోపాటు యుటి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెంకే వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటివి.సుబ్బారావు, పాఠశాల జిహెచ్‌ఎం ఎంవివి. సత్యనారాయణ ఉపాధ్యాయులు అభినందించారు.