విద్యార్థుల స్థాయి ఆధారంగా బోధన చేయాలి

Jan 22,2025 23:00
IMGttt

శిక్షణా కార్యక్రమంలో ఉపాధ్యాయులకు సూచనలిస్తున్న డిఇఒ

ప్రజాశక్తి – కాట్రేనికోన

విద్యార్థుల స్థాయి ఆధారంగా విద్యాబోధన చేసినప్పుడే విద్యార్థుల అభ్యసనా స్థాయి పెరుగుతుందని డిఇఒ డాక్టర్‌ షేక్‌ సలీం బాషా పిలుపునిచ్చారు. మండలంలోని చెయ్యరులో శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ నందు జరుగుతున్న ఎనిమిదవ దశ ఎఫ్‌ఎల్‌ఎన్‌ ట్రయినింగ్‌ సెంటర్‌ను ఆయన బుధవారం సందర్శించారు. డిఇఒ ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ఒకటవ తరగతి విద్య పునాదిగా ఉంటుందని, విద్యార్థికి భాష, గణితంలో అవసరమైన ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఓర్పు, సహనం ఆభరణాలుగా ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశా లలపై సమాజంలో నమ్మకం కలిగించేలా బోధన చేయాలన్నారు.అప్పుడే ప్రాథమిక పాఠశాలలు పూర్వ వైభవాన్ని పొందుతాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఎన్‌రోల్‌మెంట్‌ ఆందోళనకరంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు అవగాహన చేసుకుని, వచ్చే విద్యా సంవత్సరానికి ముందే ఎన్‌రోల్‌మెంట్‌కు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిం చాలన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణను సద్వినియోగం చేసుకుని, విద్యార్థుల అభ్యసనా స్థాయి పెరిగే విధంగా బోధన చేపట్టాలన్నారు. శిక్షణ సెంటర్‌ నిర్వహిస్తున్న తీరును కోఆర్డినేటర్‌ పి.రాంబాబు డిఇఒకు వివరించారు. జిల్లాకు చెందిన 360 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. అకడమిక్‌ పరంగా ఉపాధ్యా యులకు అందుతున్న కంటెంట్‌పై కెఆర్‌పిలు, డిఆర్‌పిలను డిఇఒ అడిగి తెలుసు కున్నారు. సమావేశంలో డైట్‌ లెక్చరర్‌ కళావతి, ఎంఇఒలు వైవి.సత్యనారాయణ, ప్రథమ్‌ జిల్లా కోఆర్డినేటర్‌ జీవన్‌ కుమార్‌, కీ రిసోర్స్‌ పర్సన్స్‌ మామిడి శెట్టి రాంబాబు అంకం చంద్ర సూర్యం, డిఆర్‌పిలు పాల్గొన్నారు.

➡️