బౌద్ధ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

Feb 12,2024 12:52 #Konaseema
The Buddhist association should be successful

ప్రజాశక్తి-రామచంద్రపురం : విశాఖపట్నంలో ఈనెల 25 నుండి జరిగే 11వ బౌద్ధ మహా సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లి రాంబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక చెలికాని రామారావు స్మారక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ ధార్మిక భావనలో బుద్ధుని బోధలు అత్యున్నతమైనవని, బౌద్ధ వైభవాన్ని పునరుద్ధరించాలన్న ధ్యేయంతో మహా సమ్మేళనాలను జరుపుతున్నామని తెలిపారు. నిర్వాహకులు రాష్ట్ర బి. ఎస్. ఐ. న్యాయ సలహాదారుడు కె భరత్ కుమార్ మాట్లాడుతూ బౌద్ధం, ప్రజ్ఞ, కరుణ, సమతలను బోధిస్తోందని ఈ మూడు సిద్ధాంతాలు నేటి ప్రపంచానికి అత్యవసరమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలిపారన్నారు. అనంతరం బౌద్ధ సమ్మేళన కరపత్రాన్ని, భారతదేశ జాతీయ చిహ్నాలు-బౌద్ధం అనే క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి మురళి మోహన వెంకటరమణ, కార్యదర్శి వాడ్రేవు సాయిప్రసాద్, ఉపాధ్యక్షులు పి. సత్యనారాయణ, యడ్ల కుటుంబ రావు, బి.ఎస్.ఐ. నాయకులు న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

➡️