పరిసరాల పరిశుభ్రతే నిజమైన సమాజ సేవ

Mar 15,2025 19:52
IMG-

ముంగండ లో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్‌ఎ సత్యనారాయణ, అధికారులు

ప్రజాశక్తి – పి.గన్నవరం

మన ఊరు భవిష్యత్తు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే నిజమైన సమాజసేవ అని పి.గన్నవరం ఎంఎల్‌ఎ గిడ్డి సత్యనారాయణ అన్నారు. సర్పంచ్‌ కుసుమ చంద్రకళ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివన్‌ కార్యక్రమానికి ఎంఎల్‌ఎ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ మన ఊరిని, మన పరిసరాలను కలుషితం కాకుండా స్వచ్ఛతగా ఉంచడం మార్పు మన అందరి చేతుల్లో ఉందన్నారు. ఎంపిపి గనిశెట్టి నాగలక్ష్మి శ్రీనివాస్‌ మాట్లాడుతూ గ్రామాల్లో నిరంతరం శ్రమిస్తూ పరిశుభ్రత కోసం పాటుపడుతున్న పారిశుధ్య కార్మికులను సత్కరించడం అభినందనీయమని, వారి సేవలు అందరికీ ఆదర్శంగా మారాలన్నారు. ఎంపిడిఒ కెవి.ప్రసాద్‌ మాట్లాడుతూ ముంగండ హైస్కూల్‌ విద్యార్థులు 2కె రన్‌ నిర్వహించి గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి అంబటి భూలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి పి.శ్రీనివాస్‌, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️