లొల్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ
ప్రజాశక్తి – ఆత్రేయపురం
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని కొత్తపేట ఎంఎల్‌ఎ బండారు సత్యానందరావు అన్నారు. గురువారం ఆయన మండలంలోని వద్దిపర్రు గ్రామంలో అమలాపురం-బొబ్బర్లంక ప్రధాన రహదారి నుంచి రజకుల పేటకు వెళ్లే ఏటిగట్టు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీ నిధులు రూ.50 లక్షలతో ఈ పనులను చేపట్ట నున్నారు. అనంతరం లొల్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లా డారు. గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకో వడానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఎక్కడో సుదూర ప్రాంతాల్లోని మిల్లుకు తీసుకెళ్లేవారని గుర్తు చేశారు. అమ్మిన సొమ్ము ఎప్పడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లోనే రైతుల నుంచి ధాన్యం సేకరిస్తు న్నార న్నారు. 48 గంటల్లోనే డబ్బులు జమచేస్తు న్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకట రాజు, కరుటూరి నరసింహారావు, కాయల జగన్నాధం, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.