ప్రజాశక్తి-మండపేట, ముమ్మిడివరం, రామచంద్రపురంమున్సిపాలిటీలు, పట్టణాల విస్తరణకు తగినట్టు పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని సిఐటియు జిల్లా కోశాధికారి కె.కృష్ణవేణి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కృష్ణవేణి మాట్లాడారు. అనేక మున్సిపాలిటీల్లో కొత్తగా కాలనీలు ఏర్పడ్డా యని, పట్ట ణాల విస్తరణ పెరిగిందని వీటికి తగినంత మంది పారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచాలని, చనిపో యిన కార్మికుల కుటుంబ సభ్యులకు డెత్ బెనిఫిట్ ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, సబ్బులు, నూనెలు యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ నాయకులు కొమరపు నరేంద్ర కుమార్, బంగారు కొండ, పెందుర్తి లోవరాజు, పెట్టా శ్రీను, చిరంజీవి, రాజు, చిన్న, గణేష్, అమ్ములు, సన్యాసమ్మ హరికృష్ణ పాల్గొన్నారు.ముమ్మిడివరంలో పెట్టా శివ ప్రసాద్ అధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్, ఇన్‌ఛార్జ్ కమిషనర్ పివి.సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేష్, ఎన్.అరుణ్ కుమార్, వై.వెంకటరమణ, ఎ.సత్తిబాబు, కె.జార్జ్, వి.వెంకటేశ్వర్లు, కె.గోవిందరాజు, కేశవ ప్రసాద్, వెంకటేశ్వరరావు, అరుణ ప్రదీప్ పాల్గొన్నారు.రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నూకల బలరామ్ మాట్లాడారు. యూనియన్ నాయకులు బాబూరావు, సుబ్బారావు, గుత్తుల తాతారావు, నరసరాజు, వీర్రాజు కార్మికులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-మండపేట, ముమ్మిడివరం, రామచంద్రపురంమున్సిపాలిటీలు, పట్టణాల విస్తరణకు తగినట్టు పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని సిఐటియు జిల్లా కోశాధికారి కె.కృష్ణవేణి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కృష్ణవేణి మాట్లాడారు. అనేక మున్సిపాలిటీల్లో కొత్తగా కాలనీలు ఏర్పడ్డా యని, పట్ట ణాల విస్తరణ పెరిగిందని వీటికి తగినంత మంది పారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచాలని, చనిపో యిన కార్మికుల కుటుంబ సభ్యులకు డెత్ బెనిఫిట్ ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, సబ్బులు, నూనెలు యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ నాయకులు కొమరపు నరేంద్ర కుమార్, బంగారు కొండ, పెందుర్తి లోవరాజు, పెట్టా శ్రీను, చిరంజీవి, రాజు, చిన్న, గణేష్, అమ్ములు, సన్యాసమ్మ హరికృష్ణ పాల్గొన్నారు.ముమ్మిడివరంలో పెట్టా శివ ప్రసాద్ అధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్, ఇన్‌ఛార్జ్ కమిషనర్ పివి.సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేష్, ఎన్.అరుణ్ కుమార్, వై.వెంకటరమణ, ఎ.సత్తిబాబు, కె.జార్జ్, వి.వెంకటేశ్వర్లు, కె.గోవిందరాజు, కేశవ ప్రసాద్, వెంకటేశ్వరరావు, అరుణ ప్రదీప్ పాల్గొన్నారు.రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నూకల బలరామ్ మాట్లాడారు. యూనియన్ నాయకులు బాబూరావు, సుబ్బారావు, గుత్తుల తాతారావు, నరసరాజు, వీర్రాజు కార్మికులు పాల్గొన్నారు.