నార్పల క్రాసింగ్ సమీపంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

Feb 16,2025 11:40 #Anantapuram District

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక క్రాసింగ్ సమీపంలో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడు స్థానిక దుగుమర్రి రోడ్డులో నివాసముండే ఆనందాచారిగా గుర్తించారు. గత కొంతకాలంగా మృతుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడేవాడని బంధువులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. బందువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

➡️