ధ్వoసమైన రహదారిని పునరుద్ధరించాలి

Apr 13,2025 12:46 #ambedkar konaseema

 జిల్లా అధ్యక్షుడు అడబాల

ప్రజాశక్తి-మామిడికుదురు : పెదపట్నం లంకలో సాయి లక్ష్మి క్వాయర్ ఇండ్రస్టీస్కు వెళ్లే ద్వంస మైన రహదారి సమస్య పరిష్కరించడానికి సంబంధిత అధికారులు దృష్టి సారించాలని జిల్లా బిజెపి అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారము ఆయన ధ్వoసమైన రహదారిని పరిశీలించి పరిశ్రమ నిర్వాహకుని తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 15 రోజుల నుంచి రోడ్డు మార్గం ధ్వంసంతో ముడిసరుకు రవాణాకు, తయారైన సరుకు ఎగుమతికి వీలు లేక పరిశ్రమ మూసివే వలచిన పరిస్థితి నెలకొందని తెలిపారు. పరిశ్రమ మూతతో గత 15 రోజుల నుంచి సుమారు 30 మంది కార్మికులకు పనులు నిలిచిపోవడంతో వారు ఉపాధి కోల్పోయారన్నారు. ఈ విషయమై సంబంధిత మండల సాయి, జిల్లా సాయి అధికారులకు ప్రియాతి చేసిన చర్యలు కానరాలేదని నిర్వహకులు జిల్లా అధ్యక్షులుకి తెలిపారు. ఈ విషయమై సంబంధిత ఉన్నతాధికారులతో చర్చిస్టా నని నిర్వాహకునకి హామీ ఇచ్చారు. ఆయన వెంట రాజోలు మండల శాఖ అధ్యక్షుడు త్రినాధ రావు, మామిడికుదురు మండల శాఖ అధ్యక్షుడు బైరిసెట్టి రామకృష్ణ, మెండా ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️