మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి

May 21,2024 17:04

రాజీవ్‌ గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

ప్రజాశక్తి-అమలాపురం

అమలాపురం నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయము నందు మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమం అమలాపురం పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు వంటెద్దు బాబి అధ్యక్షతన అమలాపురం నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అయితా బత్తుల సుభాషిణి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుభాషిణి మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ చిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్‌ గాంధీ పాలన లో అందరి మన్ననలు పొందారన్నారు. దేశంలో టెలి కమ్యూనికేషన్‌ అభివృద్ధి చేశారనీ అన్నారు. 18 సంవత్సరాలకే ఓటు హక్కు తీసుకువచ్చారని, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మొదట తీసుకువచ్చింది రాజీవ్‌ గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు పేరి శర్మ, సీనియర్‌ నాయకులు ఆర్లపల్లి ముత్యం, కట్టోజు శ్రీను, సుబ్బారావు, అయితాబత్తుల కుమార్‌ సింగ్‌, కోలా రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️